History, Philosophy

భారత జాతీయ వాదం – బంకిం చంద్ర ప్రభావం

భారత జాతీయ వాదం మిద ప్రబలం అయిన ప్రబావం చూపిన త్రయం దయానంద-వివేకానంద- అరవింద గోష్ అయితే, తన రచనలతో భారత జాతీయవాదం కి బంకిం చంద్ర poetic expression (భారత మాత రూపం లో) ఇచ్చారు. 1905 బెంగాల్ ఉద్యమం లో బంకిం బాబు వందేమాతరం కు అరవింద గోష్ spiritual expression ఇచ్చారు. ఆ తరువాత, స్వాతంత్ర ఉద్యమం లో వందేమాతరం పోరాట యోధుల గుండె చప్పుడు అయింది.

బంకించంద్ర బ్రిటిష్ ప్రబుత్వం లో డిప్యూటీ కలెక్టర్ గా పని చేసినపటికి, బెంగాల్ సాహిత్యం లో తన అమూల్యం అయిన రచనలతో చెరగని ముద్ర వేసారు. మొదట్లో బంకిం సాహిత్యం ప్రేమ-కుటుంబ నేపధ్యం లో సాగినప్పటికీ, ఆ తరువాత ఆత్యత్మికత, మతం, జాతివాద నేపధ్యం లో సాగాయి. బెంగాల్ లో జరిగిన సాధువుల తిరుగుబాటు నేపధ్యం లో రచించిన ఆనంద మటం , అందులోని వందేమాతర గేయం విశ్వ కవి టాగోర్ మరియు రుషి అరబిందో మిద బలం అయిన ప్రబావం చూపాయి.

ఒక నవల లోని పద్యం జాతీయ ఉద్యమ కారుల గుండె చప్పుడు ఎలా అయింది అని పరిశీలిస్తే, ఆనందమటం నవల మొత్తం సాధువులు బ్రిటిష్ ప్రబుత్వాన్ని ఎలా ఎదిరించారు అని నేపధ్యం లో నడుస్తుంది. బెంగాల్ విబజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం లోఅరబిందో ఆనందమటం ని స్పూర్తిగా తీస్కొని కళాశాల విద్యార్దులతో అతివాద ఉద్యమానికి ఉపిరి పోశారు. ఆ ఉద్యమం లో బిపిన్ చంద్ర పాల్, బరింద్ర గోష్, సిస్టర్ నివేదిత (వివేకానంద ప్రియ శిష్యురాలు) వంటి వారు పాలు పంచుకున్నారు.

బాల్-పాల్-తిలక్ త్రయం మిధ బంకిం రచనల ప్రబావం స్పష్టంగా ఉందని చరిత్రకారులు చెబుతారు. వారి ద్వారా వందేమాతరం ప్రబావం భారత దేశం అంతా పాకింది. అరవిందుని మాటలో చెప్పాలి అంటే వందేమాతరం స్తుతించిన మాత సాక్షాత్తు దుర్గ దేవి అంశ. ఆ మాతే భారత మాత..

Reviews

Mutyamanta Muddu review

ముత్యమంత ముద్దు సినిమా మిద ఒక చిన్న విశ్లేషణ

రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలు, జంధ్యాల మార్కు హాస్య చిత్రాలు ఉన్నపటికీ కాష్మోర, ఎర్ర మందారం, ఆ నలుగురు, కొబ్బరి బొండం లాంటి వినూత్న ప్రయోగాలు రాజేంద్ర ప్రసాద్ ఖాతా లో ఉన్నాయి. ఆ చిత్రాల కోవలోకే ముత్యమంత ముద్దు వస్తుంది. 1989 లో విడుదల అయిన ఈ చిత్రం ఆశించిన స్తాయి విజయం దక్కకపోయినా రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో గుర్తు పెట్టుకోవాల్సిన అద్బుత చిత్రం అని చెప్పవచ్చు . యండమూరి రాసిన థ్రిల్లర్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

ముత్యమంత ముద్దు చిత్ర నేపధ్యానికి వస్తే, ప్రేమకి ఒక నూతన అర్థాన్ని ఇంకా చెప్పాలి అంటే సామాన్యునికి అర్థం కాని మార్మిక తత్వాన్ని కథ రచయిత యండమూరి ఆవిష్కరించారు అని చెప్పవచ్చు.

సినిమా కథ క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక ఆఫీసు లో పని చేసే విధ్యాదరి అనే అమ్మాయి తన బాస్ దగ్గర నుంచి వేదింపులకు గురు అవుతుంది. ఆ సమయం లో కుర్త లాల్చి ధరించిన ఒక బక్క పలుచని యువకుడు (అనుదీప్) విధ్యదరి సమస్యలను అవలీలలగా పరిష్కరిస్తాడు. కథానాయిక సమస్యలను పరిష్కరించడమే ఆలస్యం , కథానాయిక ప్రేమలో పడటం లాంటి మూస సన్నివేశాలు ఈ చిత్రం లో ఉండవు. కథనాయుకిడికి అతీత శక్తులు ఉంటాయి, వాటితో కథానాయిక సమస్యలను పరిష్కరిస్తాడు. కాని హేతుబద్దత ని నమ్మే కథానాయిక అనుదీప్ ని అస్సలు నమ్మదు. అతని దగ్గర ఉన్న మార్మిక శక్తులు ఒక hyponotism/mesmerism అని బలంగా నమ్ముతుంది. గతం లోకి వెళ్తే కాలేజీ లోనే విద్యదరి ని చూసి అనుదీప్ ప్రేమించడం మొదలుపెడుతాడు, ప్రేమ మిధ విద్యదరికి నమ్మకం లేదు అని తెలిసి తన లోని ప్రేమని చెప్పడు.అసలు తనలో ఉంది ప్రేమేనా ? అది నిజం అయిన ప్రేమనా కాదా ? లాంటి ప్రశ్నలకు సమాధానం కొరకు ఇల్లు వదిలేసి వింధ్య పర్వతాలలో ప్రేమ తపస్సు చేస్తాడు అనుదీప్. అక్కడ ఉండే ప్రజలు అనుదీప్ ని సిద్దార్థ స్వామి అని పిలుస్తూ ఉంటారు. ఏడూ సంవత్సరాల నుంచి సుదీర్గ తపస్సు చేస్తున్న అనుదీప్ కి ఒక రోజు దేవుడు ప్రత్యక్షం అయి అతీత శక్తులు ప్రసిదిస్తాడు. విద్యదరి ముందు తనలో ఉన్న నిష్కల్మషం అయిన ప్రేమని నిరుపించుకోలేని అనుదీప్ తనకి ఉన్న శక్తులు అన్ని విసర్జిస్తాడు. ఒక హత్య కేసు లో ఇరుక్కున్న కథానాయికని రక్షించే క్రమం లో అనుదీప్ మరణం చేరువలోకి వెళ్తాడు. విద్యదరి లో మొలకెత్తే ప్రేమ తో అనుదీప్ ప్రాణం తో తిరిగి వస్తాడు.

తెలుగు లో ముత్యమంత ముద్దు మొదటి mystical thriller అని చెప్పవచ్చు . యండమూరి కలం నుంచి అద్బుతం అయిన మాటలు జాలువారాయి. చిత్రం చూస్తున్న మనకి విచిత్రం అయిన ప్రేమ లోకం కి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. మానసిక,మార్మిక, ఆధ్యాత్మిక కోణం లో ప్రేమ ని యండమూరి అద్బుతంగా వివరించారు.

– కళ్యాణ్ చంద్ర